హైదరాబాద్( Hyderabad) నగరంలోని కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 46 మంది ఇన్స్పెక్టర్లను (Transfers ) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీఐలకు బదిలీ, సీపీ ఆఫీసు వెయింటింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. 32 మంది సీఐలకు కొత్త పోస్టింగ్ ఇస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐటీ సెల్లో సీఐగా పనిచేస్తున్న జి.రాజేందర్ గౌడ్‌ను వారాసిగూడ సీఐగా, స్పెషల్ బ్రాంచ్‌లో ఉన్న ఎస్.రాఘవేంద్రను మంగళ్‌హట్, గోషామహల్ ట్రాఫిక్‌లో ఉన్న జె.రాజశేఖర్‌ను టాస్క్‌ఫోర్స్ సీఐగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఇమ్యూనల్ను సుల్తాన్‌బజార్ ట్రాఫిక్, రాజును గోషామహల్ ట్రాఫిక్ సీఐగా బదిలీ చేశారు.