హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ( Special Grade Deputy Collectors) , డిప్యూటీ కలెక్టర్లు ( Deputy Collectors) గా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ ( Transfers ) చేసింది. వరంగల్‌లో అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గట్టు సంధ్యారాణిని నిర్మల్ జిల్లాకు, నిర్మల్‌లో ఉన్న ఎల్ కిషోర్ కుమార్‌ను వరంగల్‌కు అదే హోదాలో బదిలీ చేసింది.
సిద్దిపేటలో పనిచేస్తున్న డి.నాగరాజమ్మను అదే జిల్లాలో డీఆర్వోగా నియమించింది. రాష్ట్రంలో చీఫ్ ఎలక్టొరోల్ అధికారిగా ఉన్న ఆర్ దశరథ్ను నల్గొండ డీఆర్వోగా , మల్కాజిగిరిలో పనిచేస్తున్న మాలతి సముద్రాలను అక్కడే డీఆర్వోగా, డిప్యుటేషన్‌పై మైనారిటీ వెల్ఫెర్లో పనిచేస్తున్న నాగలక్ష్మిని మహబూబాబాద్ డీఆర్వోగా బదిలీ చేసింది.
హనుమకొండలో ఆర్డీవోగా పనిచేస్తున్న రాథోడ్ రమేష్‌ను నిర్మల్ జిల్లా డీఆర్వోగా, జీఏడీలో ఉన్న డి ప్రేంరాజ్ను సూర్యాపేట డీఆర్వోగా బదిలీ చేసింది. వీరితో పాటు మరికొందరిని డీఆర్వోలుగా, ఆర్డీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.