కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడి హత్య కేసులో పోలీసులు పొరపాటుపడ్డారు. బీజేపీ అభిమానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో అతడు విడుదలయ్యాడు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. (Suvendu aide murder case) మే 6న సువేందు సహాయకుడు చంద్రనాథ్ రథ్‌పై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దర్యాప్తు చేపట్టిన బెంగాల్ పోలీసులు ప్రధాన షూటర్ రాజ్‌కుమార్ సింగ్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన అతడి సమాచారాన్ని ఆ రాష్ట్ర పోలీసులకు అందించారు.
కాగా, ఉత్తరప్రదేశ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌కు చెందిన పోలీసులు నిందితుడి విషయంలో పొరపాటుపడ్డారు. అదే ప్రాంతానికి చెందిన అదే పేరున్న 28 ఏళ్ల రాజ్ సింగ్‌ను మే 10న అదుపులోకి తీసుకున్నారు. ఒక ఎమ్మెల్యే వివాహ వేడుకకు హాజరైన అతడు ఆ తర్వాత తన తల్లితో కలిసి అయోధ్యకు వెళ్లాడు. లక్నోకు తిరిగి వస్తుండగా యూపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కోల్‌కతా పోలీసులకు అప్పగించారు.
మరోవైపు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రాజ్ సింగ్, బీజేపీ నాయకులతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసు చుట్టూ రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు అసలు నిందితుడు రాజ్‌కుమార్ సింగ్‌ను మే 18న ముజఫర్నర్లో అరెస్టు చేసింది. హత్య కోసం ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణపై బల్లియాకు చెందిన నవీన్ కుమార్ సింగ్‌ను కూడా అరెస్టు చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన రాజ్ సింగ్‌కు సీబీఐ
క్లీన్ చిట్ ఇచ్చింది. అతడు నిందితుడు కాదని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మే 20న కోల్‌కతా జైలు నుంచి అతడు విడుదలయ్యాడు. ఆ తర్వాత రాజ్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. యూపీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని, కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించాడు. ‘నన్ను అకారణంగా అదుపులోకి తీసుకుని, ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని ప్రతి రాత్రి నేను భయపడేవాడిని’ అని ఆవేదన చెందాడు. అయితే ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిన సీబీఐకి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన అరెస్టులో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశాడు.
మరోవైపు యూపీ పోలీసుల అక్రమ అరెస్ట్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. పోలీస్ అధికారాలు, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ నేత సిసోడియా ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణ లేకుండా ఏకంగా బీజేపీ వీరాభిమానిని అక్రమంగా అరెస్ట్ చేయడం దీనికి ఉదాహరణ అని సిసోడియా ఎద్దేవా చేశారు.
#WATCH | Ballia, Uttar Pradesh: Raj Singh, arrested in Suvendu Adhikari PA Murder Case, released by CBI, says, “… I was wrongly arrested, mistaken with another Raj Kumar Singh. I had gone to Ayodhya with my mother for darshan. While coming back home, a police team arrested me.… pic.twitter.com/CfiP03I9Dj
— ANI (@ANI) May 21, 2026