కొల్లాపూర్ : చిన్న నీటిపారుదల పథకాల గణన ( Minor Irrigation Scheme) కోసం గ్రామ పరిపాలన అధికారులు, ఎన్యూమరేటర్లకు శుక్రవారం మండల గణాంక అధికారి విక్రమ్ రెడ్డి ( Vikram Reddy ) ఫీల్డ్ సర్వేలో శిక్షణ ఇచ్చారు. మైనర్ ఇరిగేషన్ సెన్సస్ అనేది దేశంలో నీటి వనరుల వాడకం, లభ్యత , యాజమాన్యంపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే భారీ ప్రక్రియ అని వివరించారు.
ఇందులో భాగంగా బోర్, ట్యూబ్వెల్స్, డగ్ వెల్స్కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా చెరువులు, రిజర్వాయర్లు, ఉపరితల లిఫ్ట్ పథకాలకు సంబంధించిన వివరాలు, నీటిపారుదల సంభావ్యత , డైవర్షన్ స్కీమ్ వంటి కీలక పదాలకు అధికారిక నిర్వచనాలను స్పష్టంగా వివరించారు.
ప్రతి నీటి వనరుకు ఖచ్చితమైన భౌగోళిక స్థానం సేకరించి జియో-ట్యాగింగ్ (Geo-tagging) ఎలా చేయాలో గ్రామ పరిపాలన అధికారులకు శిక్షణ ఇస్తున్నామనఇ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల జీపీవోలు పాల్గొన్నారు.