జమ్ము, జనవరి 19: దేశాన్ని కశ్మీర్‌తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాట్రా-శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగీలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామని వారు తెలిపారు.
కొత్తగా నిర్మించిన బ్రాడ్‌గేజ్ లైనులో ప్రయాణికుల రైళ్లు గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో పయనించడానికి రైల్వే భద్రత కమిషనర్(ఉత్తరం సర్కిల్) ఆరు రోజుల క్రితం అనుమతి ఇచ్చారు.