అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. మునిగిపోతున్న ఇద్దరు విద్యార్థులను స్థానికులు రక్షించగా ఒకరు మృతి చెందారు. నదిలో దొరికిన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరంత పడమటకు చెందిన వారిగా గుర్తించారు.