అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు కూలీలు దుర్మరణం (Labours Died) చెందారు. మండలంలోని కలగొట్ల వద్ద పొగాకు కూలీ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మార్కాపురం మండలం భూపతిపల్లికి చెందిన ఇద్దరు కూలీలు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి . ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.