బీసీ సీఎంకు డెడ్‌లైన్ ఏమీ లేదు
మొన్నటివరకు బీసీ ముఖ్యమంత్రి విషయంలో గొప్పలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పుడు మాట మార్చారు. రాష్ర్టానికి బీసీ వ్యక్తి సీఎం కావడానికి ఎలాంటి తమకు ఎలాంటి తొందర కానీ, డెడ్లైన్లు ఏమీ లేవని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు.. 2039 వరకు కూడా అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
- భవిష్యత్తులో ఏదో ఒక రోజు సాధ్యం
- రేవంత్ పాలన 2039 వరకు కొనసాగుతుందనే విశ్వాసం
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ వ్యాఖ్య
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకు బీసీ ముఖ్యమంత్రి విషయంలో గొప్పలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పుడు మాట మార్చారు. రాష్ర్టానికి బీసీ వ్యక్తి సీఎం కావడానికి ఎలాంటి తమకు ఎలాంటి తొందర కానీ, డెడ్లైన్లు ఏమీ లేవని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు.. 2039 వరకు కూడా అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏదో ఒక నాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని బుధవారం ఓ మీడియాతో మహేశ్‌గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకే రేవంత్‌రెడ్డి 2034 వరకు తానే సీఎంగా ఉంటానని చెప్పారని, అందులో తప్పేమీ లేదన్న మహేశ్.. బీసీ సీఎం నినాదం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేమని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ విషయంలో ఆమె కుమార్తె సుస్మిత తొందరపడి వ్యవహరించారని అభిప్రాయపడ్డారు.
బీజేపీతో సాధ్యం కాదు
తాము అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తామంటున్న బీజేపీ కనీసం రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కూడా బీసీకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ నేత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవినే తీసేశారని, గతంలో బండారు దత్తాత్రేయ సీటును కిషన్‌రెడ్డి లాకున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో బీజేపీ మొక మొలకెత్తదన్నారు. రేవంత్‌రెడ్డికి తనకు మధ్య కెమిస్ట్రీ కుదిరిందన్న మహేశ్.. తన విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోనని స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

