ఓపెన్ కాస్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు
ములుగు జిల్లా వెంకటాపూర్ శివారులో సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆమె రామప్ప దేవాలయాన్ని సందర్శించగా.. బొగ్గు తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా రామప్ప ఆలయాన్ని పరిరక్షించాలని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అకిరెడ్డి రామ్మోహన్రావు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
- రామప్ప ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్, అక్టోబర్ 21 : ములుగు జిల్లా వెంకటాపూర్ శివారులో సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆమె రామప్ప దేవాలయాన్ని సందర్శించగా.. బొగ్గు తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా రామప్ప ఆలయాన్ని పరిరక్షించాలని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అకిరెడ్డి రామ్మోహన్రావు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ సంపదైన రామప్ప ఆలయాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, దానికి ముప్పు వాటిళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ అధైర్య పడొద్దని, ఆలయ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండా అధికారులతో సమావేశమై చర్చిస్తానని తెలిపారు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక లేకుండా ఎలాంటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

