కేసీఆర్ నివాసంలో ఘనంగా దసరా వేడుకలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగను పురసరించుకొని వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఆయన నివాస ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షు, కేసీఆర్ సతీమణి శోభమ్మ, కోడలు శైలిమ పాల్గొన్నారు.
- కుటుంబ సమేతంగా ఆయుధ, శమీ పూజ
- పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగను పురసరించుకొని వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఆయన నివాస ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షు, కేసీఆర్ సతీమణి శోభమ్మ, కోడలు శైలిమ పాల్గొన్నారు.
అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కేసీఆర్ శమీ వృక్షానికి(జమ్మి చెట్టు) ప్రత్యేక పూజలు గావించారు. తన నివాసానికి విచ్చేసిన బంధువులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిజేసి ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, పార్టీ నాయకులు జహంగీర్, జుబేర్, కేసీఆర్ పీఎస్ నాగేందర్ రెడ్డితోపాటు కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

