మహదేవపూర్(కాళేశ్వరం),సెప్టెంబర్ 7 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. బరాజ్ సందర్శన కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన పలువురు పర్యాటకులు తరలివచ్చారు. బరాజ్ అప్‌స్టీమ్, డౌన్స్టీమ్లను వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి బరాజ్‌పై సెల్ఫీ దిగి సంబురపడ్డారు.
నాడు కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణకు సాగు, తాగు అందించేందుకు నిర్మించిన అద్భుత ప్రాజెక్ట్ ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి గురికావడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బరాజ్‌ను వినియోగంలోకి తీసుకొస్తేనే రైతులు, ప్రజల ఇబ్బందులు తీరుతాయని అభిప్రాయపడ్డారు.