నందికొండ, జనవరి 23 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షణ, పులులు సంతతి పెంపుపై నేషనల్ కంజర్వేషన్ అధారిటీ సభ్యులు యోగేశ్, అలోక్ కుమార్ వారం రోజులుగా చేపట్టిన పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉందన్నారు. ఫారెస్ట్‌లో జంతువుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. వీటిని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంతువుల పరిశీలనకోసం అటవీశాఖ రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన వాహనాలను నాగార్జునసాగర్ ఫారెస్ట్ ఆఫీస్‌లో వారు ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ కంజర్వేటర్ క్షితిజ, కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివాని, జిల్లా ఫారెస్ట్ అధికారులు రాజేశ్వరి, రోహిత్, డివిజనల్ అధికారులు సర్వేశ్వర్, తిరుమల రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.