న్యూఢిల్లీ, జూలై 4 : జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. వాహనదారుల ప్రయాణాన్ని మరింత చవక చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఎన్హెచ్ చార్జీల నిబంధనలు, 2008 ప్రకారం యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారని, అయితే ఈ నిబంధనలను సవరించి కొత్త సూత్రం ప్రకారం టోల్ చార్జీలను నిర్ణయించి వసూలు చేస్తారని, ఈ కొత్త నిబంధనల ప్రకారం యూజర్ చార్జీలు 50 వరకు తగ్గుతాయని రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.