హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ): రష్యాతో యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులు సొంత రాష్ర్టానికి చేరుకుంటున్నారు. రెండు బ్యాచ్‌లలో మొత్తం 39 మంది విద్యార్థులు ఇక్కడ అడుగుపెట్టారు. తొలుత వీరంతా ముంబై, ఢిల్లీలకు చేరుకోగా, తెలంగాణ అధికారులు ఆయా విద్యార్థులను సురక్షితంగా శంషాబాద్‌కు చేర్చారు.మరోవైపు, ఉక్రెయిన్ నుంచి ఏపీకి కూడా పలువురు విద్యార్థులు ఆదివారం చేరుకొన్నారు.
బుకారెస్ట్ నుంచి ఢిల్లీ ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్నవారు.
శివరాజ్ ప్రత్యూష (కాప్రా, హైదరాబాద్), జక్కు లలితాదేవి (కరీంనగర్), పెనుగెండ దివ్య (లాలాపేట, హైదరాబాద్), గుడిపల్లి శివదీక్షిత (మల్కాజిగిరి, హైదరాబాద్), తోట ఐశ్వర్య (షేక్‌పేట, హైదరాబాద్), తోట రమ్య (షేక్‌పేట, హైదరాబాద్), ప్రతాప్ తరణి (లాలాపేట, హైదరాబాద్), హరి వెంకటగీతిక (కూకట్పల్లి, హైదరాబాద్), సప్పెట మనీష (ఈస్ట్ ఆనంద్‌బాగ్, హైదరాబాద్), గంగరాజు నాగశ్రీకరి (రామంతాపూర్, హైదరాబాద్), తోకల సాయి మహిత (సరూర్‌నగర్, హైదరాబాద్), తోకల సాయి మాన్య (సరూర్‌నగర్, హైదరాబాద్), ప్రియాంక (నాదర్గుల్, హైదరాబాద్), మల్లం వివేక్ (భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం), దుర్గా నియోష్ జయకర్ (కోఠి, హైదరాబాద్), నీల హర్ష వరోహన్ (ఆరేపల్లి, వరంగల్), పోలమని రేవంత్‌కుమార్ (హైదరాబాద్), ఆప్సాన్ బేగం (హైదరాబాద్), కావలి అమిషా శైలు (రామచంద్రాపురం, సంగారెడ్డి), అలిగేటి లోహిత్ (జగిత్యాల), కందుకూరి పునీత్ నర్సింహా (నిర్మల్), మహ్మద్ అబ్దుల్ రహీం (చందానగర్, హైదరాబాద్), ఆఫ్రాన్ అహ్మద్ (హైదరాబాద్).
ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్నా. బాంబుల శబ్దంతో భయంగా గడిపా. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రానికి ధన్యవాదాలు.