
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎంయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్లి పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆర్టీసీ స్థితిగతులు, కార్మికుల సమస్యలు కవిత దృష్టికి తీసుకెళ్లినట్టు థామస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో టీఎంయూ అధ్యక్షుడు కమలాకర్‌గౌడ్, సలహాదారుడు మారయ్య, జాయింట్ సెక్రటరీలు నరేందర్, బీడీరావు, ఉపాధ్యక్షులు పీఎస్‌రెడ్డి, ఈఎస్బాబు, స్టేట్ సెక్రటరీలు చందూలాల్, రాఘవరెడ్డి ఉన్నారు.