తిరుపతి : తిరుపతితో పాటు పరిసర జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమలకు వెళ్లే రెండు నడక రోడ్లను మూసివేస్తున్నట్లు తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వానలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈనెల నేడు, 18(శుక్రవారం)న అలిపిరి, శ్రీవారి మెట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని వివరించారు.
భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.