యాదాద్రి, డిసెంబర్ 8 : యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
స్వామివారికి తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామివారికి గరుడ వాహన, అమ్మవారికి తిరుచ్చి వాహన సేవ నిర్వహించారు. సుమారు 13 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.19,49,503 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.