ఓదెల : పెద్దపల్లి జిల్లాలోని సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Jatara) నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి ( DCP Bhukya Ramreddy ) తెలిపారు. గురువారం ఓదెల మండలం కొలనూరు గుట్టలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు, పార్కింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కొలనూరు జాతర చుట్టూ గుట్టల మధ్యన చెరువు సమీపంలో చెట్లు ఉండి ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. జాతర చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి జాతర మేడారం తర్వాత రెండవ జాతరగా పేరుగాంచినట్టు స్థానికులు వివరించారు.
డీసీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కాపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్, జాతర చైర్మన్ కొలిపాక మధునయ్య, వైస్ చైర్మన్ సట్ల సదయ్య గౌడ్, సర్పంచ్ పల్లె కనకయ్య, మధ్య వేణి రవి యాదవ్, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.