న్యూఢిల్లీ: తమిళ ఫిల్మ్ స్టార్ విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి ఖజగం(Tamilaga Vettri Kazhagam) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 11వ తేదీన తమ పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రచారం తమకు గుర్తు కేటాయించమని అభ్యర్థించింది. మొత్తం ఏడు సింబల్స్‌కు చెందిన లిస్టును ఆ పార్టీ సబ్మిట్ చేసింది. అయితే ఆ గుర్తులన్నీ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. స్వంతంగా క్రియేట్ చేసిన మూడు మరో సింబల్స్‌ను కూడా ఆ పార్టీ సమర్పించింది.