భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పులి కనిపించింది. రేగళ్ల రేంజర్ జశ్వంత్ప్రసాద్, బీట్ ఆఫీసర్ శోభన్ కారులో వెళ్తుండగా జంగాలపల్లి రహదారి పక్కన నిల్చున్న పులిని చూసి ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారా యి. పులి సంచారంపై పరిసర గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.