బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక బొర్ర గణేష్ కాలనీలో గల నాలుగు ఇండ్లలో చిల్లర వస్తువులు, బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు, ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగు ఇండ్లలో సామగ్రిని ఎత్తుకెళ్లారు.
కాలనీ వాసులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాసర ఎస్ఐ శ్రీనివాస్ చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. ఎవరైనా ఊరికి వెళ్లినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలుపాలన్నారు.