మల్లాపూర్, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్ నందీశ్వర ఆలయంలో భక్తులు సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరిగౌడ్, పీఆర్. నాగరాజు, సుదర్శన్, టీఆర్ఎస్ డివిజన్ అ ధ్యక్షుడు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, తండా వాసుగౌడ్, గూ డూరు శైలేశ్‌రెడ్డి, చిగుళ శ్రీనివాస్ (హమాలీ శ్రీనన్న) నెమలి రవి, గౌరిశంకర్, పద్మారెడ్డి, మహేందర్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, శీతల విజయ్, నర్సింహారెడ్డి, సానల రవి, రాములు, ఎల్లేశ్, రాజు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో అన్నదానం..
మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్‌లో గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ రోజు స్వాములకు ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. 41 రోజు ఎంతో పవిత్రంగా కఠోర దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం మంచి నిర్ణయమన్నారు.
సాయిబాబా ఆలయంలో ..
కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ వెంకటేశ్వరనగర్ కాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని వసతులను కల్పించారు.
కార్తిక పౌర్ణమి పూజలు, వ్రతాలు.
రామంతాపూర్, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని రామంతాపూర్‌లోని ఆలయాల్లో పూజలు జరిగాయి. సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యవ్రతాలు జరిగాయి. మల్లికార్జునస్వామి, కోదండ రామాలయంలో ఉదయం నుంచి స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కోట్ల నర్సింహా రెడ్డి, కంది ఆగిరెడ్డి, దయాకర్ రెడ్డి ఆలయ పూజారులు మోత్కూరి శేఖర్‌బాబు శర్మ, అనిల్ శర్మ, కిరణ్‌శర్మ, కామేశ్వరశర్మ పాల్గొన్నారు.
కుషాయిగూడ వేంకటేశ్వర ఆలయంలో..
చర్లపల్లి నవంబర్ 19 : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. 164 జంటలు పూజల్లో పాల్గొన్నారని, అర్చకులు లక్ష్మణాచార్యులు, వెంకటరమణాచార్యులు, నారాయణాచార్యులు, వేణుగోపాలాచార్యులు, కలకోట శేషాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో శాస్ర్తోక్తం పూజలు జరిగాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ పల్లె కృష్ణారెడ్డి, కార్యనిర్వాహణ అధికారి పాశం లక్ష్మారెడ్డి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ పల్లె వీరారెడ్డి, సంకూరి శ్రీనివాస్‌గౌడ్, ఆలయ మాజీ ధర్మకర్తలు కొమిరెల్లి సుధాకర్‌రెడ్డి, మాదిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, అన్నం ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.