Medak | మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళను ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం సీసీ టీవీ ఫుటేజిని వెతుకుతున్న సమయంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మాసాయిపేట మండలం రామాంతపూర్‌లో ఓ మహిళ అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్న సమయంలో అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు.
మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన బాధిత మహిళను వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. ఆమె ఏ వివరాలు చెప్పలేకపోయింది. దీంతో బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించారు.