క్షీరదాల్లో స్థిరంగా గాలిలో ఎగురగలిగేవి గబ్బిలాలు మాత్రమే. చాలా పక్షుల కంటే ఇవి చురుకైనవి. వీటి రెక్కులు చాలా పొడవుగా విస్తరించి ఉంటాయి. ఇవి చాలా విచిత్రమైన జీవులు. రాత్రిపూట మాత్రమే ఎగురుతాయి. అలాగే, గుంపులుగా అవి ఆకాశంలో విహరించడం మనం ఎప్పుడూ చూసుండం. కానీ, ఈ రెండింటికీ భిన్నమైన అరుదైన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘సైన్స్ గర్ల్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో గుహలోంచి గబ్బిలాల గుంపు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. గబ్బిలాల సమూహం ఆకాశంలోకి ఎగురుతూ కనిపించాయి. అది నల్లని పొగనా? లేదా గబ్బిలాల అనేది గుర్తించలేని విధంగా అవి ఎగురుతూ కెమెరాకు చిక్కాయి. ఈ మనోహరమైన వీడియోను మెక్సికోలోని క్యూవా డి లాస్ ముర్సిలాగోస్ అనే గుహ వద్ద చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పటివరకూ 4.6 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకున్నది. చాలామంది ఈ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు. ఉదయంపూట ఆకాశంలో ఎగురుతున్న గబ్బిలాలను తామెప్పుడూ చూడలేదని, ఇది తమకు చాలా ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
Watch this endless river of bats emerging from this cave
This is Cueva de los Murciélagos in Mexico pic.twitter.com/JbmbhOdgHc
— Science girl (@gunsnrosesgirl3) July 22, 2022