కోటగిరి జూలై 6 : నిజామాబాడ్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఆదివారం ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఆలయంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఏకాదశి ఉప వాస దీక్షలు చేపట్టి ఉదయం నుండి విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఉప వాస దీక్షలు పట్టిన భక్తుల కోసం సోమవారం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయం నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4గంటలకు గ్రామంలో నగర ప్రదర్శన ఉంటుందన్నారు. బుధవారం సాయంత్రం పల్లకి సేవా అనంతరం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ విఠలేశ్వర ఆలయం నిర్వాహకులు ఎడ్డెడి హనుమండ్లు, కోయిగూర్ సాయిలు, పోమ్మేడి శ్రీనివాస్, అనిల్ కులకర్ణితో పాటు తదితరులు ఉన్నారు.