అమరావతి : సాంకేతిక సహయంతో అనేక నేరగాళ్లను పట్టుకుంటున్న పోలీసులకు ఓ దొంగ మాత్రం చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నాడు. చోరీలకు పాల్పడుతున్న దొంగ సమాచారాన్ని పోలీసులకు అందిస్తే సదరు వ్యక్తులకు పారితోషికాన్ని ప్రకటించారు పోలీసులు. కాకినాడకు చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తు వారికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఇతగాడిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం అంటూ లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, వీరవాసరం, అకివీడీ , పాలకొడేరు, ఉండి గ్రామాలల్లో చోరీలకు పాల్పడ్డ వీరబాబును పట్టుకోవ డానికి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించినా అతడిని పట్టుకోలేక పోతున్నారు.
దొంగ సమాచారాన్ని గాని, అతడిని పట్టుకున్నా పారితోషికం అందజేస్తామని భీమవరం టూ టౌన్ పోలీసులు పలు గ్రామాల్లో వాల్పోస్టర్లను అతికించారంటే ఆ దొంగను పట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్ధమవుతుంది.