oh sukumari | 2025లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంది సక్సెస్ అందుకున్నాడు తిరువీర్ (ThiruVeer) . కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన తిరువీర్ భరత్ భూషణ్ డైరెక్షన్లో సినిమాను ప్రకటించాడని తెలిసిందే. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తోంది.
ఓ సుకుమారి (oh sukumari) టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఐశ్వర్యా రాజేశ్ స్పిరిటెడ్ దామిని ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా తిరువీర్ పోషిస్తున్న లుక్‌ను షేర్ చేశారు. ఇందులో యాదగిరి పాత్రలో నటిస్తున్నాడు తిరువీర్. కర్లీ హెయిర్‌తో లుంగీ, బనియన్ మెడలో టవాల్‌తో బ్రష్ వేసుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ న్యాచురల్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ మూవీని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 19 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి భరత్ మాచిరాజు సంగీతం అందిస్తున్నాడు. రజాకార్, పొలిమేర సినిమాలకు పనిచేసిన సీహెచ్ కుశేందర్ సినిమాటోగ్రఫర్ కావడంతో సినిమాపై హైప్ పెరిగిపోతుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తిరువీర్ ఈ సినిమాతో ఇక సౌతిండియాలో మార్కెట్ పెంచుకోబోతున్నాడన్నమాట.
YADAGIRI from #OhSukumari ❤️🔥
A role that lets you see yourself on the big screen 🤗
Looking forward to bringing it to the big screen soon! pic.twitter.com/rOXcjFZtHc
— Thiruveer (@iamThiruveeR) January 26, 2026
Patang Movie | ఓటీటీలోకి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్