హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ విజయ డెయిరీ అనైతిక ధోరణిని ఎండగడుతామని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు. ప్రైవేట్ డెయిరీల్లో పాలు, నెయ్యి ప్యాకింగ్ చేసి హైదరాబాద్‌లోని వినియోగదారుల్లో అయోమయం సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ విజయ డెయిరీ చేసిన ఆరోపణలపై ఏపీ డెయిరీ అభ్యంతరాలు తెలుప డం విడ్డూరమని తెలిపారు. సహకార స్ఫూర్తికి, తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమ ని హెచ్చరించారు. విజయ బ్రాండ్ పేరు తో మోసం చేయవద్దని సూచించారు.