ఆదిలాబాద్, ఎదులాపురం : కేసుల నమోదులో ఎలాంటి జాప్యం వహించరాదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) అన్నారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలపై ( Crime) , గతంలో జరిగిన కేసుల వివరాలు వాటి పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌కు ( Police Case ) వచ్చే ఫిర్యాదుదారుల తో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి ఒక్క కేసు దర్యాప్తు వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు అడిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రానున్నది వర్షాకాలం. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తమై పోలీస్ స్టేషన్ నందు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీసు వాహనాలలో అత్యవసర సామాగ్రిని కలిగి ఉండాలని, వాగులు వంకలు బ్రిడ్జిలను దాటి ప్రవహిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రైతులు మోసపోకుండా నకిలీ విత్తనాలను చలామణిలో లేకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా చూడాలని, ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లను ఆకస్మికంగా తనిఖీ చేయాలని కోరారు. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా పశువుల రవాణా జరగకుండా ఆపాలని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, అదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, స్వామి, సీఐలు బి సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్ రావు, కె ఫణిదర్, ఎ వెంకటేశ్వరరావు, పండే రావు, గుణవంత్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, బి శ్రీపాల్, ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ , కమ్యూనికేషన్, పీసీఆర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.