దేశంలో ఓటర్ల సంఖ్య 94 కోట్లను దాటింది. 1951తో పోలిస్తే ఆరు రెట్లు పెరిగింది. అయితే ఓటింగ్ శాతం మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
అంతంత మాత్రంగానే ఓటింగ్ స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఓటు హక్కు వినియోగదారు సంఖ్య సగటున 50-60 శాతానికి మించడం లేదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు, యువత ఓటింగ్ పట్ల ఆసక్తి కనబరచకపోవడం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ ఓటింగ్ నమోదవుతున్నదని చెబుతున్నారు.