రెండేండ్లుగా జలమండలి మేనేజర్ పోస్టు ఖాళీ
రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నివాసాలు అక్కడే.. సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, మీడియా సంస్థల అధినేతలు అక్కడే ఉంటారు. పబ్‌లు, క్లబ్‌లతో పాటు అనేక వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి వందల కోట్ల పన్నులు చెల్లిస్తుంటారు.
- ఇన్‌చార్జీలతో కాలం వెళ్ల్లదీస్తున్న వైనం
- అత్యంత కీలకంగా జూబ్లీహిల్స్ సెక్షన్
- సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం
- సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో విచిత్రం
బంజారాహిల్స్, ఫిబ్రవరి 2: రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నివాసాలు అక్కడే.. సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, మీడియా సంస్థల అధినేతలు అక్కడే ఉంటారు. పబ్‌లు, క్లబ్‌లతో పాటు అనేక వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి వందల కోట్ల పన్నులు చెల్లిస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంచినీటి సరఫరా, సీవరేజ్ సమస్యలను పర్యవేక్షించాల్సిన కీలకమైన బాధ్యతలు కలిగిన జలమండలి సెక్షన్‌కు పూర్తిస్థాయి మేనేజర్ లేకపోవడంతో ఇన్‌చార్జీలతో కాలం వెల్లదీస్తున్నారు. సీఎం నివాసముంటున్న ప్రాంతంలో పూర్తిస్థాయి మేనేజర్ లేకున్నా..జలమండలి ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యమవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీతో పాటు జలమండలి పరిధిని కూడా పెంచాల్సిందేనంటూ..
ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేయడంతో ఆగమేఘాల మీద అడ్డగోలుగా సరిహద్దులు నిర్ణయిస్తున్న అధికారులు.. అత్యంత ప్రముఖ ప్రాంతంలో జలమండలి మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీతో పాటు పలు కాలనీలు జలమండలి డివిజన్ 6 పరిధిలోని జూబ్లీహిల్స్ సెక్షన్ కిందకు వస్తాయి. ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన శ్రీహరి రెండేళ్ల కిందట బదిలీ కావడంతో అప్పటినుంచి ఇక్కడ ఇన్‌చార్జీగా బంజారాహిల్స్ జలమండలి డీజీఎం బాధ్యతలు చూస్తున్నారు. రోజువారీ నీటి సరఫరా, బిల్లులు వసూలు, సివరేజ్ సమస్యల పరిష్కారంతో పాటు కొత్తలైన్లకు ప్రతిపాదనలు, వాటర్ ట్యాంకుల పంపిణీ వ్యవస్థలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మేనేజర్‌దే. అయితే పూర్తిస్థాయి మేనేజర్ లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో సివరేజ్ సమస్యలు, నీటి సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికితోడు ప్రధాన రహదారుల్లో ఉన్న అనేక పబ్స్, రెస్టారెంట్స్ నుంచి వ్యర్థాలు నేరుగా సివరేజ్ లైన్లలోకి వదులుతుండడంతో పలు ప్రాంతాల్లో సివరేజ్ పొంగుతుంటుంది. సెక్షన్ మేనేజర్ లేకపోవడంతో సమస్యలు తీవ్రతరమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి మేనేజర్లు లేకపోవడంతో స్థానిక లైన్మెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ కనెక్షన్లు, సివరేజ్ లైన్ల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సీఎం నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో పూర్తిస్థాయి మేనేజర్‌ను నియమించే పరిస్థితిలో లేని జలమండలి అధికారులు మహా జలమండలి అంటూ ఆచరణకు అమలు కాని ప్రణాళికలు రూపొందిస్తుండడం హాస్యాస్పదమని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి జూబ్లీహిల్స్ జలమండలి సెక్షన్‌కు పూర్తిస్థాయి మేనేజర్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

