OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో తెడ్ల గట్టయ్య డాక్టరేట్ సాధించారు. పర్యవేక్షణలో ప్రొఫెసర్ జె సావిత్రి పర్యవేక్షణలో ‘బారియర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ అమాంగ్ ద లర్నర్స్ ఆఫ్ ఎంజేపీటీబీసీఆర్ స్కూల్స్: యాన్ ఎక్స్ప్లోరేటరీ స్టడీ’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి గట్టయ్య సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. గట్టయ్య కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందినవారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.