హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందినవారు ఆదివారమే విధుల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ పదోన్నతుల ఎడిట్ ఆప్షన్ల గడువు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
ఈ మేరకు శనివారం రాత్రే పదోన్నతుల ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1,241 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులిచ్చారు. మల్టిజోన్-1లో 1100కు పైగా, మల్టిజోన్-2లో 140 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు.