హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పర్యవేక్షణకు పాఠశాల విద్యాశాఖ స్పెషలాఫీసర్లను నియమించింది.
17 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. 19అంశాలపై పర్యవేక్షణ జరుపాలని సూచించారు.