హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ గీతదాటినవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి ప్రజానాయకుడే కాకుండా, తనకు మంచి మిత్రుడని తెలిపారు. అతని ఆవేదన, ఆందోళనను తాము అర్థం చేసుకుంటామని పేర్కొన్నారు.
పార్టీలో చర్చించాల్సిన అంశాలను నాలుగు గోడల మధ్యనే మాట్లాడాలని, ఇటీవల కొన్ని అంశాల్లో రాజగోపాల్ పార్టీ లైన్ మాట్లాడిన అంశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఆ వ్యాఖ్యలు హైకమాండ్ ఉన్నాయని, అధిష్ఠానం ఇచ్చిన హామీల అమలు బాధ్యతను అగ్రనేతలే చూసుకుంటారని పీసీసీ చీఫ్ శుక్రవారం గాంధీ భవన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో చిట్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టంచేశారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ పార్టీ, ప్రభుత్వాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కొన్ని అంశాల్లో నాయకుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం సహజమేనని, వాటిని వ్యక్తిగత విభేదాలుగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
బిల్లుల విషయంలో ప్రభుత్వం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బిల్లుల అంశంపైనా స్పందించారు. ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులిచ్చామని, ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మిగిలిన సర్దుబాట్లు కూడా చేస్తామని తెలిపారు. భూ కేటాయింపులపైనా స్పందించిన పీసీసీ చీఫ్.. ‘2014 నుంచి ఇప్ప టి వరకు జరిగిన భూముల కేటాయింపులను పరిశీలిస్తే గతంలో ఏ ధరకు భూములిచ్చారు. తాము ఏ ధరకు కేటాయింపులు చేస్తున్నాం’ అనేది స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డికి భూ ముల కేటాయింపుల అంశంపై తనకు సమాచారం లేదని, ఈ అంశంలో మంత్రి శ్రీధర్ చెప్పిందే ఫైనల్ స్పష్టంచేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, ప్రజలు కట్టిన సొమ్ముతో వచ్చేవని, అందువల్ల ప్రధానమంత్రి ఫొటో డిజిటల్ రేషన్‌కార్డులపై వేయాల్సిన అవసరం లేదని మహేశ్ బీహార్, తమిళనాడు రాష్ర్టాల్లో దొడ్డు బియ్యం అమలు చేస్తున్నారని, దేశం మొత్తం సన్నబియ్యం అమలు చేస్తే మోదీ ఫొటో పెడుతామని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో పాతవారికి 60%, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 40% ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేల్లో అకడకడ అసంతృప్తులు ఉండటం సహజమేనని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ ద్వారా బీజేపీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కులాలకు ప్రాధాన్యం ఉండదని, గెలిచే అవకాశాలు ఉన్నవారికే టికెట్ ఇస్తామని స్పష్టంచేశారు. నామినేటెడ్ స్థానాల్లో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం పార్టీ కేంద్ర కమిటీ తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చేలోపు అభ్యర్థుల ఎంపిక అంశం కొలికి వస్తుందని మహేశ్ గౌడ్ చెప్పారు.