జనగామ : వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు వెళుతున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ఖు తరలించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రఘునాధపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నా చేపట్టారు. నర్సంపేట డిపో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న వారు నర్సంపేటకు వెళుతున్న క్రమంలో రఘునాథపల్లి పోలీసులు వారిని అరెస్టు చేశారు.
విషయం తెలుసుకున్న జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే రఘునాథపల్లి పోలీస్ స్టేషన్కు కార్యకర్తలతో చేరుకొని, స్టేషన్ ఎదురుగా బైఠాయించి బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వారి మరణానికి కారణమైందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారి అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.