Gadwal | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
Gadwal | ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
జోగులాంబ గద్వాల : ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ ( RTC Driver Shanker Goud ) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Hanmanth Naidu ) డిమాండ్ చేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నా, అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండివైఖరినీ అవలంభిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి, బీచుపల్లి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్,గువ్వల గోపాల్,చిత్తరి కిరణ్, మోహన్ యాదవ్, కమ్మరి రాము, గంజిపేట రాజు, కురవ పల్లయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

