Tirumala | శ్రీవారికి రూ.94.80 లక్షల విలువైన బంగారు పతకాలు విరాళం
Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను ( Gold Medals) విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు.
టీటీడీకి హైదరాబాద్ భక్తులు రూ.20 లక్షలు విరాళం

హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన డాక్టర్ గీతిక సాయి శుక్రవారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు ( Annaprasadam Trust ) కు రూ.10,01,116 విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవోకు విరాళం డీడీలను అందజేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

