Aamir Khan | ఈ ఏడాది తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం కూలీ. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. నెట్టింట ట్రోల్స్ కూడా దర్శనమిచ్చాయి. కూలీ ఫలితంతో తన లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ డైరెక్టోరియల్ వెంచర్ ఖైదీ 2 ఇక ఉండకపోవచ్చంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ కథనాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆసక్తికర అప్డేట్ను షేర్ చేశాడు.
కూలీలో కామియో రోల్లో మెరిసిన ఈ స్టార్ హీరో లోకేశ్ కనగరాజ్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమీర్‌ఖాన్, లోకేశ్ కనగరాజ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయట. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ స్వయంగా ప్రకటించడం విశేషం. తమ కాంబోలో సినిమా వస్తుందని.. ప్రస్తుతం నరేషన్ సెషెన్స్ కొనసాగుతున్నాయని అమీర్ ఖాన్ వెల్లడించాడు. అంతేకాదు తాను ప్రతీ ఏడాది ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని.. అయితే అనుకున్న విధంగా జరుగడం లేదన్నాడు. ఈ విషయంలో మరోసారి ఫెయిల్ కాకుండా తాను అనుకున్నట్టుగా సినిమా చేయాలని ఫిక్సయ్యాడట అమీర్ ఖాన్.
తాను ముంబైలో ఉన్నప్పుడు లోకేశ్ కనగరాజ్ కథ చెబుతాడన్నాడు. ఏడాదికి సినిమా చేయాలనేది నా ఉద్దేశం. ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ajay Bhupati | అజయ్ భూపతి – జయకృష్ణ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!