కోల్‌కతా: ఫొటోలో కనిపిస్తున్న నల్ల చిరుత పేరు ‘సాయ’. బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో ఉండేది. 2018 నుంచి ఇది కనిపించకుండాపోయింది. ఏమైపోయిందోనని అధికారులు, జంతుప్రేమికులు ఆందోళనచెందారు. కాలం గడిచింది. క్రమంగా దాని గురించి అందరూ మర్చిపోయారు. అయితే, అదే రిజర్వ్‌లో ఇటీవల సాయ మళ్లీ ప్రత్యక్షమైంది. దీంతో ఎదురుచూస్తున్న స్నేహితుడు మళ్లీ కనిపించాడంటూ జూ అధికారులు, జంతు ప్రేమికులు సంబురపడుతున్నారు. ఇంతకాలం సాయ ఎక్కడికి వెళ్లిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.