హైదరాబాద్ : ఈ నెల 11న జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు.
సభావేదిక నిర్మాణానికి సంబంధించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 11న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, పార్టీ కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.