హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో బోధనా సిబ్బంది నియామకానికి అనుసరిస్తున్న రిజర్వేషన్ విధానం ఏమిటో తెలియజేయాలని ట్రిబ్‌కు హైకోర్టు ఆదేశించింది.
రాజేశ్‌కుమార్ దారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ పోస్టుల భర్తీలో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థ నియామక బోర్డు(ట్రిబ్)కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.