రామన్నపేట, మార్చి 31 : దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్ర కార్యాలయం రామన్నపేట నూతన పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌గా కునపురి కవిత, వైస్ చైర్మన్‌గా కంభంపాటి శ్రీనివాస్. డైరెక్టర్లుగా బొడ్డు అల్లయ్య, బండ ఉపేందర్‌రెడ్డి, సింగనబోయిన దశరథ, ముదిరెడ్డి సంజీవరెడ్డి, వెలిమినేటి సత్యనారయణ, పోలెపాక సత్యనారాయణ, నాగిళ్ల కృష్ణమూర్తి, గౌరిశెట్టి అశోక్ ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేవారికే గుర్తింపు లభిస్తుందని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలంధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి మలిగె రమేశ్, సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, మెట్టు మహేందర్‌రెడ్డి, కోళ్ల స్వామి, ఉప్పు ప్రకాశ్, కాటేపల్లి సిద్ధమ్మ, రేఖ యాదయ్య, చెరుకు సోమయ్య, ముత్యాల సుజాత, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, దోమల సతీశ్, గాదె పారిజాత, గోగు పద్మ, ఏనుగు పుష్ప, ఆమేర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయి, నాయకులు అంతటి రమేశ్, శ్రీధర్‌రెడ్డి, రాములు, మల్లేశం పాల్గొన్నారు.