Bharathi Ghattamaneni | రమేష్ బాబు వారసుల ఎంట్రీపై పెరుగుతున్న ఆసక్తి… హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న భారతి..!
Bharathi Ghattamaneni |సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bharathi Ghattamaneni |సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన అన్న రమేష్ బాబు కూడా సినీ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రమేష్ బాబు బాల నటుడిగా అల్లూరి సీతారామరాజు సినిమాలో కనిపించగా, తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
చివరిసారిగా 1997లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్, అతిథి, దూకుడు వంటి సినిమాలను నిర్మించారు. 2022 జనవరి 8న కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూశారు. అన్న రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎంతో అనుబంధం ఉండేది. అయితే ఆయన మరణ సమయంలో మహేష్‌కు కరోనా రావడంతో చివరి చూపు కూడా దక్కలేదు.
ఇప్పుడేమో రమేష్ బాబు వారసుల ఎంట్రీపై చర్చ మొదలైంది. ఆయన కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రమేష్ బాబు కుమార్తె భారతి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలపై ఆసక్తి ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్లా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న భారతి భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bharati
- ghattamanen
- goutham
- Krishna
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

