The Ghost Movie | ‘ది ఘోస్ట్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. నాగార్జునలోని మన్మధుడు బయటకొచ్చాడుగా..!
The Ghost Movie First Single | చాలా కాలం తర్వాత 'బంగార్రాజు'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నాగార్జున. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన 'ది ఘోస్ట్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
The Ghost Movie First Single | చాలా కాలం తర్వాత ‘బంగార్రాజు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నాగార్జున. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన ‘ది ఘోస్ట్’ అనే యాక్షన్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
‘వేగమ్’ అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో నాగార్జున, సోనాల్ చౌహాన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మలేషియాలో షూటింగ్ జరుపుకున్న ఈ పాట లోకేషన్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. భరత్-సురభ్ స్వర పరిచిన ఈ పాటను కృష్ణ మదినేని రచించగా.. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also:
RRR Movie | ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడు కేటగిరిల్లో నామినేషన్స్?
Project-k Movie | ‘ప్రాజెక్ట్-K’ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు?
Samantha | సమంత ఆ అరుదైన రికార్డును క్రియేట్ చేసిందా?
Trivikram | తివిక్రమ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

