హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల జిల్లా అగ్నిమాపక అధికారులు, ఏడీఎఫ్‌వోలు, స్టేషన్ ఫైర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీవర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో రెస్యూ బృందాల సంసిద్ధత, పడవలు, డీ-వాటరింగ్ పంపులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. అత్యవసర పరిస్థితికి స్పందించేలా కేంద్రాలు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.