పటాన్చెరు టౌన్, డిసెంబర్ 31: యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదని పటాన్చెరు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీలో నూతనంగా నిర్మించనున్న యువజన కార్యాలయ భూమిపూజలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో అపారమైన శక్తి ఉంటుందన్నారు. యువజన సంఘాలకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. యూత్ రూమ్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. కార్పొరేటర్ మె ట్టుకుమార్యాదవ్ మాట్లాడుతూ యువ జన సంఘాలు సమాజానికి అండగా నిలిచి తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్, ఉప్పరి రాములు, గుండమల్ల రాజు, బస్తీ నాయకులు పాల్గొన్నారు.
టోల్ పాసులు అందించాలి
గుమ్మడిదల, డిసెంబర్ 31: మండల పరిధిలోని సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలకు టోల్ ప్లాజా ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ మండల టీఆర్ఎస్ నాయకులు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్ అండ్ బిల్డింగ్ అధికారి గణపతిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జడ్పీటీసీ కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకోసం గ్రామ పంచాయతీల తీర్మానం, ఎంపీ, ఎమ్మెల్యే లేఖలను కూడా అధికారికి అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎప్ మండల పార్టీ అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, నాయకులు విజయ్‌భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
రామచంద్రాపురం, డిసెంబర్ 31: ఉపాధ్యాయ సంఘం ఎస్‌టీయుటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సయ్యద్సాబేర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్రాథోడ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, ఎస్టీయూ నాయకులు రమణకుమార్, హఫీజ్, పం డరి, నరసింహరాజు, ఖయ్యుం, రియాజ్‌అహ్మద్, ఈశ్వర్ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
నూతన సంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఉండాలి
పటాన్చెరు, డిసెంబర్ 31: నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సబ్బండ వర్గాల ప్రజలకు ఈ ఏడాది కలసిరావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో, మంత్రుల సలహాలపై నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామన్నారు.