కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
మొత్తం 97లో 77 డిపోల్లో ఘన విజయం.. టీడబ్ల్యూయూ కూటమికి ఘోర పరాజయం.. బస్‌భవన్ ఎదుట ఈయూ కూటమి సంబురాలు.. ‘గ్రేటర్'లోని మొత్తం 26 డిపోల్లో 23 క్లీన్‌స్వీప్.. ఇది కార్మిక విజయం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ
- కాంగ్రెస్ ప్రలోభాలను నమ్మని ఆర్టీసీ కార్మికులు
- ఆ పార్టీ కుయుక్తులను పసిగట్టి పక్కన పెట్టిన వైనం
- ఏకపక్షంగా తీర్పునిచ్చిన కార్మికులకు ఈయూ కూటమి నేతలు వెంకన్న, థామస్‌రెడ్డి ధన్యవాదాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడపల్లి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రభంజనం సృష్టించడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్ భవన్ ఎదుట ఆ కూటమి సంఘాల ఆధ్వర్యంలో శనివారం సంబురాలు చేసుకున్నారు. దశాబ్ద కాలం తరువాత జరిగిన ఆర్టీసీ గుర్తిం పు సంఘం ఎన్నికల్లో 12 సంఘాలు మూడు కూటములుగా ఏర్పడి బరిలో నిలిచాయి. ప్రధానంగా టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి ఒక కూటమిగా బరిలో నిలిచి విజయదుందుభి మోగించాయి. ప్రత్యర్థివర్గం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ కూటమిని చిత్తు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలకు 77 డిపోల్లో ఘనవిజయం సొంతం చేసుకొని ఈయూ కూటమి సర్కార్‌కు షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మియాపూర్, రాణిగంజ్, మేడ్చల్ మినహా మిగిలిన 23 డిపోల్లో కార్మిక ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలిచారు. పోస్టల్ బ్యాలెట్లో 980మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలను అధికారికంగా ఈనెల 17న ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్మథనం
ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వంలో భయం మొదలైంది. కాంగ్రెస్ మద్దతిచ్చిన కూటమి ఘోరంగా ఓడిపోవడంపై రవాణా మంత్రి సం బంధిత నాయకులతో చర్చిస్తున్నట్టు తెలిసిం ది. ఈ పరాజయం తాము ఊహించలేదని మంత్రి విచారం వ్యక్తంచేసినట్టు సమాచారం. ప్రభుత్వంపై కార్మికుల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అంచనా వేయలేకపోయిందని నిపుణులు చెప్తున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బొంతు రామ్మోహన్‌లాంటి నాయకులు ఎన్ని వ్యూహాలు పన్నినా ఓటమి ఎదురవడం తో హస్తం పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. డిపోలవారీగా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయనివారిపై చర్యలు తీసుకునే పనిలో అంతర్గత రిపోర్ట్ రెడీ చేసినట్టు తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే విష యం ఈయూ కూటమి గెలుపుతో తేలిపోయింది.
విలీన హామీని సాధించడమే లక్ష్యం
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)ల సహకారంతో అతిపెద్ద గుర్తింపు సంఘంగా అవతరించిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విలీన హామీని సాధిస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న వెల్లడించారు. శనివారం ఈయూ కార్యాలయం వద్ద తోటి కార్మికులతో కలిసి గెలుపు సంబురాల్లో పాల్గొన్న వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోరాట సంఘాలకు పట్టం కట్టిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
బయటపడ్డ కార్మికుల ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికుల్లో ఎంతటి ఆగ్రహం దాగి ఉన్నదో ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కొద్ది నెలల్లోనే విలీనం చేస్తామని హామీ ఇచ్చి.. మూడేండ్లు అవుతున్నా ఆ ప్రక్రియ చేపట్టలేదని, అందుకే కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ నాయకులు కార్మికులను ఎన్నిరకాలుగా ప్రలోభపెట్టినా.. ఎక్కడా తలొగ్గకుండా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని కృతజ్ఞతలు చెప్పారు. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటువేసిన ప్రతి కార్మికుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సమస్యలపై ప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతామన్నారు.
సర్కార్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి
ప్రభుత్వం మొండి వైఖరి వీడి.. ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు ఉద్యమించినా పట్టించుకోలేదు. ఎన్నికలు నిర్వహించి గెలిచినవారిని విలీన ప్రక్రియ కమిటీలో నియమిస్తామని పేర్కొన్నది. ఆ మేరకు మా యూనియన్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వానికి వత్తాసు పలికిన కొన్ని సంఘాలకు మా గెలుపుతో సమాధానమిచ్చాం.
– కామ్రేడ్ సత్యం, ఆర్టీసీ కార్మికుడు.
ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఈయూ కూటమి విజయం వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు శక్తినిచ్చింది. మా సమస్యలు పట్టించుకోకపోతే ఎంతకైనా పోరాడుతాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలువాలి.
-గుండు కృష్ణ నేత, ఆర్టీసీ కార్మికుడు
సమస్యల పరిష్కారానికి పోరాడుతాం
ఆర్టీసీ కార్మికుల్లో చీలిక తీసుకురావాలని కొన్ని సంఘాలు పెద్దఎత్తున పనిచేశాయి. ప్రభుత్వంలోని కొందరు వారికి అండగా నిలిచి అనేక తాయిలాలు అందించారు. కానీ కార్మికులంతా మా కూటమి పక్షాన నిలబడ్డారు. వారి నమ్మకాన్ని మేం నిలుపుకొంటాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఎంతకైనా పోరాడుతాం. ప్రభుత్వం వెంటనే విలీన ప్రక్రియ చేపట్టాలి.
-శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

