పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజాయుద్ధ నౌక సుద్దాల హనుమంతు వర్ధంతిని పురసరించుకుని హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వీరోచిత సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు గళం ఒక విప్లవ చైతన్యమై నిలిచిందని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వెట్టిచాకిరీ, పీడనలపై ఆయన కలం, గళం ఎకుపెట్టి ప్రజల్లో విప్లవ ఉత్తేజాన్ని రగిలించారని, సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించి సాయుధ పోరాటానికి వన్నె తెచ్చారని గుర్తుచేశారు.
సుద్దాల హనుమంతు చూపిన పోరాట మార్గాన్ని, ఆయన సిద్ధాంతాలు, ఆశయాలను నేటితరం పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ సుద్దాల హనుమంతు రాసిన విప్లవ గీతాలను ఆలపించి సభలో ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

