ప్రజలకు చేరువైన పాలన
కొత్త జిల్లాలు ఏర్పాటై పదేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మేడ్చల్ కలెక్టరేట్‌ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సందర్శించారు. పాలన వికేంద్రీకరణతో సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జిల్లాల ఏర్పాటు మైలురాయిగా నిలిచిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల భవిష్యత్ అవసరాలను గుర్తించి, జిల్లాలను పునర్ వ్యవస్థీకరించిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రతి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించారు.
- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మేడ్చల్, అక్టోబర్10(నమస్తే తెలంగాణ)/ మల్కాజిగిరి: ప్రజల భవిష్యత్ అవసరాలను గుర్తించి, జిల్లాలను పునర్వవ్యవస్థికరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువచేశారని తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రతి ప్రాంతానికీ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ను శనివారం ఎమ్మెల్యే, పలువురు నేతలు సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణతోనే పరిపాలన ప్రజలకు చేరువవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అధికారులు అందుబాటులోకి రావడం ద్వారా వేగంగా జరుగుతాయన్నారు. జిల్లా ఏర్పాటుతో స్థానిక అవసరాలు తీరుతాయని, ప్రజా సమస్యల పరిష్కారాలు వేగవంతం అవుతాయన్నారు. పాలన వికేంద్రీకరణతో సత్వర పరిష్కారానికి అవకాశం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జిల్లాల ఏర్పాటు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

